Monday, July 19, 2010

విజయనగర సామ్రాజ్య వైభవానికి ప్రతీక చంద్రగిరి కోట

విజయనగర సామ్రాజ్య వైభవానికి ప్రతీక చంద్రగిరి కోట. విజయ నగర యుగం నాటి సంస్కృతి, వైభవం సజీవంగా ఉట్టిపడే రాజ మహల్‌, రాణీమహల్‌, ఇతర కట్టడాలన్నీ చూపరులను ఆకర్షిస్తున్నా యి. తిరుపతి పట్టణానికి అతి సమీపంలో ఉన్న ఈ మహా కట్టడం 10 దశాబ్ధాలు పూర్తయినా నేటికి సజీవంగా చెక్కు చెదరని కళావైభవం కళ్ల కు కట్టినట్లు కనబడుతుంది. సుందర లోయ లో గంభీరమైన రాజప్రసాదాలు, సొంపైన తటాకాలు, శిలామండపాలు విజయనగర సామ్రాజ్య ప్రభువులకు మూడవ రాజధాని నగరమై విరాజిల్లిన చంద్రగిరి కోట అంటే నాటి వైభవానికి ప్రత్యక్ష సాక్ష్యం.
పురాణ గాధలను అనుసరించి ఇక్కడ ఎతైన ఒక కొండపై చంద్రుడు తపమాచరించి శివుడిని ప్రసన్నం చేసుకొని వరం పొందాడని అందువలన నాటి నుంచి చంద్రగిరి అనే పేరుతో ఈ ప్రాంతం ప్రాచుర్యా న్ని పొందింది. చరిత్రను అనుసరించి క్రీ.శ. 1000 సంవత్సరం నాడు చంద్రగిరి పట్టణానికి సమీపంలో ఉన్న నారాయణవనాన్ని పరిపాలిం చిన ఇమ్మడి నరసింహ యాదవ రాయలవారు ఈ కోట నిర్మించారు. ఈ కోట చుట్టూ ప్రాకారాలను అనుసరించి పెద్ద శిలలతో నిర్మించిన చదరపు రుజువులు ఉన్నాయి. కోట గోడలను ఆనుకొని అగడ్తలు ఉండేవి.
దుర్గానికి ఇరువైపులా ప్రవేశ ద్వారాలున్నాయి. స్థానిక చరిత్ర ప్రకారం చంద్రగిరి కోట 314 సంవత్సరాలు యాదవ రాజుల ఆధీన ములో ఉంది. చంద్రగిరి ప్రాంతానికి ప్రభువుగా ఉండి, ఆ కోటలోనే నివసించిన ఘనత అప్పటి యాదవరాజులకే దక్కింది. ఆ తరువాత హంపిలో విజయనగర చక్రవర్తులు శక్తి కోల్పోయి రాజ్యభారము వహించలేక శత్రువు విజయనగర సామ్రాజ్య ఆధిపత్య భారమును తీసుకొని పేరు ఘడించారు. నరసింహరాయుల కాలమున క్రీ.శ. 1565లో సంభవించిన రాకాతి తంగడి (తళ్లికోట) యుద్ధంలో విజయ నగర ప్రభువులు పరాజితులై గత్యంతరము లేక కర్నాటక రాష్ట్రానికి చెందిన హంపి నుంచి పెనుగొండ (అనం తపురం జిల్లా) చిత్తూరు జిల్లాలోని చంద్రగిరి పట్టణానికి తరలించారు.
ఆ నాటి నుంచి చంద్రగిరి కోట పలు చారిత్రక ఘటనలకు సాక్షిగా నిలచింది. క్రీ.శ. 1000వ సంవత్స రంలో ఇమ్మడి నరసింహ యాదవ రాయుల చే నిర్మించిన చంద్రగిరి కోటలో ఆముఖమై ఉన్న భవనాన్ని రాజమహల్‌ అని పేర్కొంటా రు. ఈ భవన నిర్మాణం అంచలంచెలుగా పూర్తి చేస్తూ 16వ శతాబ్ధం నాటికి ఈ కట్ట డం పూర్తయినట్లు చరిత్రకారుల అంచనా. మూడంతస్థులతో గంభీరంగా ఈ భవనం దర్శనమిస్తోంది. రాజమహల్‌ పైన ఉన్న మూ డు గోపురాలలో పెద్ద గోపురం 24 చదరపు అడుగుల వైశాల్యం గల దర్బారు మాలులోని మధ్య గోడలు లేని స్తంభ పంక్తి రెండంతస్థుల ఎత్తు వరకు ఉంది. ఈ ఏర్పాటు వలన దర్బారులో కి తగినంత గాలి, వెళుతురు వచ్చేందుకు అవకాశం ఏర్పడింది.
భవ నం పునాదులు రాతితోను, పై భాగాన్ని ఇటుక, కరక్కాయ, సున్నం, బెల్లం, కోడిగుడ్డులోని తెల్లసొన తదితర మిశ్రమాలతో నిర్మించినట్లు తెలుస్తోంది. ఈ భవనంలో ఎక్కడా కూడా కలప వినియోగించకపోవ డం ప్రత్యేక విశేషం. పరదాల ఏర్పాటుకు కూడా గోడలలోనే ఏర్పాటు చేసి ఉంచారు. రాజమహల్‌పైన ఉన్న గోపురాల్లో ఏర్పాటు చేసిన రం ధ్రాలు లోపలివైపు బంగారు ఆభరణాలు, నిధులు నిక్షిప్తం చేయబడిన ట్లు స్థానికులు పేర్కొంటారు. ఇలా నాటి రాజుల వైభవాన్ని నేటికీ కళ్లకు కట్టినట్లు చూపించే మహల్‌ వైభవాన్ని తనివితీరా చూడాల్సిందే.
అంత కాకుండా పంచలోహ విగ్రహాలు శైవ, వైష్ణవ , జైన మతాలకు చెందిన శిలా కాంస్య నిర్మితమైన దేవతా ప్రతిమలు ఈ కోటలో ఉన్నాయి. ఈ ప్రాంతాన్ని అభివృద్ధి పరచిన విజయనగర చక్రవర్తుల సేవకు గుర్తింపు గా శ్రీకృష్ణ దేవరాయులు, ఆయన దేవేరులు తిరుమలదేవి, చిన్నాంబిక లు, వెంకటపతిరాయులు, శ్రీరంగరాయులు తదితరుల శిలా ప్రతిమ లు సహజతత్వాన్ని ఉట్టిపడేలా కనిపిస్తాయి.దక్షిణ భారతదేశంలోని అ న్ని రాష్ట్రాల నుంచి తిరుపతి పట్టణానికి రైలు ప్రయాణ సౌకర్యం ఉంది. తిరుపతి నుంచి ఆర్‌టిసి బస్సులలో చం ద్రగిరి పట్టణానికి చేరుకోవచ్చు. తిరుపతి పట్టణానికి చేరువలో రేణిగుంట విమానా శ్రయం కూడా ఉండటం విశేషం. యాత్రి కుల సౌకర్యం కోసం చంద్రగిరి నుంచి రాజమహల్‌ పురావస్తు ప్రదర్శనశాలకు వెళ్లడానికి ఆటోలు, రిక్షాలు నడుస్తున్నాయి

No comments:

Post a Comment