హంపిలో ప్రదర్శించిన భువనవిజయం నాటకం |
హంపి : ప్రపంచ పర్యాటక కేంద్రంగా భాసిల్లుతున్న హంపి ఉత్సవాలు కర్ణాటక, భారత దేశ జనోత్సవాలకే పరిమితం కాకుండా ప్రపంచోత్సవాలుగా వెలుగొందాలని బీజేపీ జాతీయ నేత, లోక్‌సభ సభ్యులు అనంత్‌కుమార్ పేర్కొన్నారు. శనివారం రాత్రి హంపి ఉత్సవాల ముగింపు (2011) కార్యక్రమంలో ప్రసంగించారు. హంపిలో నిత్యోత్సవాలుగా ఉండే విధంగా రూ. వందలాది కోట్లతో ఉద్యానవనం (థీమ్‌పార్కు) ఏర్పాటు చేస్తామన్నారు. అమెరికా డిస్నీల్యాండ్ మాదిరిగానే ఉద్యానవనం ఏర్పాటు చేస్తామన్నారు. ఈ ఉద్యానవనం ప్రపంచ పర్యాటకులకు ఆకర్షణీయంగా తిలకించే విధంగా ఏర్పాటు చేస్తామన్నారు. ఈ ఉద్యానవనాన్ని వచ్చే ఏడాదికి ప్రారంభిస్తామని తెలిపారు. ప్రపంచంలో ఉక్కు రాజధాని చైనా దేశంలో బీజింగ్ ఉందని, అదే బీజింగ్ తరహాలో బళ్లారిలో స్టీల్ ఇండస్ట్రీస్ ఏర్పాటు చేసి బళ్లారిని మరో బీజింగ్‌గా మారుతుందనడంతో ఎలాంటి సందేహమూ లేదని అన్నారు. దేశంలో ప్రతి భారతీయుడు గర్వించదగిన హంపిలో శ్రీకృష్ణదేవరాయల పాలన ప్రపంచ చరిత్రలోనే చిరస్థాయిగా నిలిచిపోయిందన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రులు గాలి జనార్దనరెడ్డి, శ్రీరాములు, బళ్లారి సిటీ ఎమ్మెల్యే గాలి సోమశేఖరరెడ్డి, బళ్లారి ఎంపీ శాంత, ఎమ్మెల్యేలు నాగేంద్ర, సురేష్‌బాబు, నేమిరాజ్‌నాయక్, చంద్రానాయక్, జిల్లా అధికారి శివప్ప, ఎస్‌పీ నాగరాజు తదితరులు పాల్గొన్నారు. అంతకు ముందు అనంత్‌కుమార్ హంపీలోని శ్రీవిరుపాక్షేశ్వర స్వామి ఆలయాన్ని దర్శించుకున్నారు.
శ్రీకృష్ణదేవ రాయల పేరు వింటేనే తమ తండ్రి కన్నడ కంఠీరవ దివంగత డాక్టర్ రాజ్‌కుమార్ గుర్తువస్తారని ప్రముఖ కన్నడ సినీ నటుడు, పవర్‌స్టార్ పునీత్ రాజ్‌కుమార్ అన్నారు. శనివారం రాత్రి ఆయన హంపి ఉత్సవ ముగింపు కార్యక్రమంలో ప్రసంగించారు. హంపి ఉత్సవాల్లో పాల్గొనడం తన అదృష్టంగా భావిస్తున్నానని తెలిపారు. ఇలాంటి అత్యంత అద్భుతమైన శిల ్పకళా నైపుణ్యత కలిగిన ప్రాంతంలో తన సినిమా షూటింగ్ చేయాలని కోరిక ఉందన్నారు. త్వరలో ఇక్కడ సినిమా తీసేందుకు ఏర్పాట్లు చేస్తామన్నారు.
హంపి పురవీధుల్లో కన్నుల పండువగా ముగింపు ఉత్సవాలు |
ఆకట్టుకున్న రాతి గుండు ఎత్తే పోటీలు
హంపి ఉత్సవాల సందర్భంగా కడ్డిరాపురం కుస్తీ అకాడమిలో యువజన సేవ, క్రీడా శాఖ కార్యాలయం ఆధ్వర్యంలో శనివారం నిర్వహించిన రాతి గుండు ఎత్తే పోటీలు ఆకట్టుకున్నాయి. 135 కేజీల నుంచి 155, 175 కేజీల బరువు గల రాతిగుండ్లు ఎత్తే పోటీలను నిర్వహించారు. 155 కేజీల రాతి గుం డును సుమారు 6.81 నిమిషాల్లో హొస్పేటకు చెందిన క టగి శివప్ప తేలి కగా ఎత్తి ప్రథమ స్థానంలో నిలిచాడు. రెండవ స్థానంలో ఇబ్రహింసాబ్ 9.42 నిమిషాల్లో ఎత్తి ద్వితీయ స్థానంలో నిలిచాడు. కూడ్లిగికి చెందిన అబూబ్ అక్తర్ 14.2 నిమిషాల్లో 135 కేజీల బరువును ఎత్తి తృతీయ స్థానంలో నిలిచాడు. వివిధ తాలూకాల నుంచి వచ్చిన ఆరు మంది ఈ పోటీల్లో పాల్గొన్నారు. యువజన సేవ, క్రీడాకార్యాలయ కార్యదర్శి అయ్యార్ పెరుమాల్, అసిస్టెంట్ డెరైక్టర్ రాజు చావలే, తాలూకా పంచాయతీ కార్యనిర్వహణాధికారి బాలస్వామి దే శప్ప పాల్గొన్నారు.
అలరించిన సంగీత, నృత్య ప్రదర్శనలు
ఉత్సవాల సందర్భంగా శుక్రవారం రాత్రి శ్రీకృష్ణదేవరాయ ప్రధాన వేదికపై నిర్వహించిన సంగీత, నృత్య ప్రదర్శనలు, సాంస్కృతిక కార్యక్రమాలు ప్రేక్షకులను ఆనందడోలికల్లో ముంచెత్తాయి. శుక్రవారం రాత్రి నిర్వహించిన సంగీత కార్యక్రమంలో చెన్నైకి చెందిన సంగీత దర్శకులు శివమణి బృందం నిర్వహించిన కార్యక్రమం ప్రేక్షకులను ఆనందంలో ముంచింది. ఢిల్లీకి చెందిన శ్రీమతి శైలుజిందాల్ నిర్వహించిన కూచిపూడి నృత్యం వేదికపై మరింత ఆకర్షణీయంగా నిలిచింది. శ్రీలంక, మంగోలియా, రువాండా తదితర విదేశీ కళాకారులు నిర్వహించిన విదేశీ జానపద సంప్రదాయక నృత్యాలకు ప్రేక్షకుల నుంచి ఈలలు, చప్పట్లు, హర్షధ్వానాలు మిన్నంటాయి.
ఉత్సవాల సందర్భంగా మూడో రోజు శనివారం కమలాపురం చెరువులో బోటింగ్ క్రీడా పోటీలను నిర్వహించారు. పెడల్ బోట్, మోటర్ బోట్, రోయింగ్ బోట్, క్యూరాకిల్ కెనోయింగ్ పోటీలు ఏర్పాటు చేశారు. బోటింగ్‌లో శిక్షణ పొందిన వందలాది మంది యువతీ యువకులు పాల్గొన్నారు. నోపాసన సంస్థ నిర్దేశకులు షకీబ్ బోటింగ్ పోటీలకు న్యాయనిర్ణేతగా వ్యవహరించారు
అలరించిన సంగీత, నృత్య ప్రదర్శనలు
హంపిలో సందర్శకులను ఆకట్టుకున్న జానపదవేషాలు |
ఉత్సవాల సందర్భంగా మూడో రోజు శనివారం కమలాపురం చెరువులో బోటింగ్ క్రీడా పోటీలను నిర్వహించారు. పెడల్ బోట్, మోటర్ బోట్, రోయింగ్ బోట్, క్యూరాకిల్ కెనోయింగ్ పోటీలు ఏర్పాటు చేశారు. బోటింగ్‌లో శిక్షణ పొందిన వందలాది మంది యువతీ యువకులు పాల్గొన్నారు. నోపాసన సంస్థ నిర్దేశకులు షకీబ్ బోటింగ్ పోటీలకు న్యాయనిర్ణేతగా వ్యవహరించారు
No comments:
Post a Comment