Friday, July 9, 2010
శ్రీ కృష్ణ దేవరాయల పంచశత పట్టాభిషేక మహోత్సవాలు
సాహితీ సమరాంగణ చక్రవర్తి, ఆంధ్ర భోజుడు శ్రీ కృష్ణ దేవరాయల పంచశత పట్టాభిషేక మహోత్సవాలను ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం 2010 జూలై 5 వ తేదీన హైదరాబాదులో ప్రారంభించింది. ఈ ఉత్సవాలు ఆగస్టు నెల 8 వ తేదీన అనంతపురంజిల్లా పెనుకొండలో జరిగే ముగింపు ఉత్సవాలతో ముగుస్తాయి. జులై 5 ,6 ,7 తేదీలలో హైదరాబాదు లో , 14,15 తేదీలలో చంద్రగిరి లో , 16 , 17 ఉదయగిరిలో , 18 , 19 తేదీలలో కొండవీడులో , 26 , 27 తేదీలలో ఖమ్మంలో 25,26 తేదీలలో కడపలో , 30 , 31 తేదీలలో విశాఖపట్నం జిల్లా పొట్నూర్ లో , ఆగస్టు 2,3 తేదీలలో కర్నూలులోనూ కూడా ఈ ఉత్సవాలు జరుగుతాయి.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment