Monday, July 19, 2010

శత్రు దుర్భేద్యమైన ఉదయగిరి కోట

ఉదయగిరి నెల్లూరుకు వాయువ్యమున 96 కి.మీ దూరములో ఉన్నది. 14వ శతాబ్దములో విజయనగర రాజులు కట్టించిన కోట శిధిలాలకు ప్రసిద్ధి. ఇక్కడ 938 మీ ఎత్తైన సంజీవ కొండ వైద్య సంబంధిత వనమూలికలకు ప్రసిద్ధి. ఈ గిరిలో 365 దేవస్థానాలు 101 కోనేరులు ఉన్నవి. నెల్లూరు జిల్లాలో ఒక ప్రముఖ పర్యాటక ప్రదేశమైన ఉదయగిరిలో పల్లవుల మరియు చోళుల కాలం నాటి దేవాలయాలు కలవు.
చరిత్రలో ఉదయగిరి పట్టణం యొక్క తొలి ప్రస్తావన 14వ శతాబ్దంలో కనిపిస్తుంది. ఒరిస్సా గజపతుల సేనాని అయిన లాంగుల గజపతి ఉదయగిరిని రాజధానిగా చేసుకుని చుట్టుపక్కల ప్రాంతాలను పరిపాలించాడు. 1512లో ఉదయగిరి కృష్ణదేవరాయల పాలనలోకి వచ్చింది. కోట చాలా దిశలనుండి శత్రు దుర్భేద్యమైనది. దీన్నీ తూర్పు వైపున ఉన్న అడవి బాట ద్వారా లేదా పశ్చిమం వైపున ఉన్న కాలిబాట ద్వారానే ముట్టడించే అవకాశమున్నది. సంవత్సరకాలం పాటు జరిగిన కోట దిగ్భంధనం ఫలితంగా ప్రతాపరుద్ర గజపతి ఉదయగిరి కోటను కోల్పోయాడు.
గజపతుల పాలనలోనూ ఆ తర్వాత విజయనగర పాలనలోనూ కోటను విస్తరించాడు. మొత్తం పట్టణాన్ని మరియు దానిని ఆనుకుని ఉన్న వెయ్యి అడుగుల ఎత్తున్న కొండ చుట్టూ పటిష్టమైన గోడకట్టించారు. కోటలో మొత్తం నిర్మాణాలు ఉన్నాయి. అందులో 8 కొండపైన, 5 దిగువన ఉన్నాయి. కోటలో అనేక ఆలయాలు, తోటలు కూడా ఉండేవి.

No comments:

Post a Comment